25-08-2025 07:14:00 PM
నిర్మల్,(విజయక్రాంతి): రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి కమిషన్ ప్రతి నెల విడుదల చేయాలని గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతూ సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఐదు నెలలుగా కమిషన్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది గురవుతున్నామని ప్రభుత్వం ప్రకటించిన గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని అన్ని మండలాల్లో తాసిల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందించారు. సోన్ మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో ఆ సంఘం నాయకులు అనంతుల రాజేందర్ దశరథ్ రాము తదితరులు పాల్గొన్నారు.