15-09-2025 01:13:49 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో మాదకద్రవ్యాల మహమ్మారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మో పుతోంది. డ్రగ్స్ రహిత రాష్ర్టమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్ టీమ్’ తన దూకుడును ప్రదర్శిస్తోంది. రాష్ర్టవ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం సహకారం తో ఏకకాలంలో మెరుపుదాడులు నిర్వహించి మత్తు ముఠాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది.
ముఖ్యంగా రైళ్లు, పారిశ్రామిక వాడలే లక్ష్యంగా సాగిన ఈ దాడుల్లో వందల కిలోల గంజాయి, నిషేధిత అల్పాజోలం తయారీ కేంద్రాన్ని ధ్వం సం చేసి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఒక్కరోజే ఈగల్ బృందాలు రాష్ర్టంలోని పలు ప్రాం తాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి డ్రగ్స్ మాఫియాకు గట్టి షాక్ ఇచ్చాయి. ముఖ్యం గా రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న ముఠాల ఆటకట్టించారు.
రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో నిఘా పెట్టిన ఈగల్ బృం దం, ఏకంగా 91 కిలోల గంజాయిని పట్టుకుంది. ఈ గంజాయిని తరలిస్తున్న నలు గురు సభ్యుల ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా వరంగల్ కేం ద్రంగా సాగుతు న్న గంజాయి దందాకు ఈగల్ టీమ్ చెక్ పెట్టింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో 32 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తు న్న నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేశా రు.
మరో ఘటనలో, వరంగల్‌లోనే ఏకంగా 214 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒక కీలక నిందితుడిని అదుపులోకి తీసుకోవడం సం చలనం రేపింది. అలాగే సంగారెడ్డి జిల్లాలో రహస్యంగా నడుపుతున్న అల్పాజోలం తయారీ యూనిట్‌ను గుర్తించి దాని గుట్టురట్టు చేశారు. ఈ దాడితో రాష్ర్టంలో డ్రగ్స్ తయా రీ మూలాలపై గట్టి దెబ్బ కొట్టినట్లయింది. ములుగు జిల్లా వాజేడు వంటి ఏజెన్సీ ప్రాంతంలోనూ దాడులు నిర్వహించి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయి రవాణా జరగకుండా కట్టడి చేస్తున్నారు. మొత్తంమీద, రాష్ట్ర వ్యా ప్తంగా పోలీస్ సహకారంతో ఈగల్ టీమ్ నిర్వహిస్తున్న ఈ దాడులు మత్తు ముఠాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ తనిఖీలను మరింత ముమ్మరం చేసి డ్రగ్స్ రహిత తెలంగాణను సాధిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.