24-07-2025 12:00:00 AM
- మూడేళ్లలో పూర్తి స్థాయి నిర్మాణం
- ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీ, పీజీ కోర్సులు
- మంత్రి తుమ్మల
ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, జూలై 23 (విజయక్రాంతి): ప్రపంచంలో గర్వించదగ్గ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని రూపొందించాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాల్వంచలో బుధవారం యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సంబంధించి నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారుల సూచనలతో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ప్రవేశపెట్టాల్సిన కోర్సులు, మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణం, నిధుల సమీకరణ తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తి స్థాయి విశ్వవిద్యాలయం నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, విదేశాలలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను సందర్శించి అభ్యాసం చేసి, అక్కడి అనుభవాల ఆధారంగా మౌలిక సదుపాయాలు, కోర్సుల రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఆర్ యు ఎస్ ఏ నిబంధనల ప్రకారం నిధుల సమీకరణ చేయాలన్నారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రికి సమర్పించి, వారి ఆమోదంతో ఆగస్టులో యూనివర్సిటీ ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే యూజీ, పీజీ స్థాయిలో బీఎస్సీ జియాలజీ, బిఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎమ్మెస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సులు ప్రారంభించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖనిజ సంపదకు కేంద్రంగా నిలుస్తుందని, జిల్లాలోని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన 300 ఎకరాల భూమిలో, మూడు సంవత్సరాలలో శాశ్వత భవనాలు, అవసరమైన వసతులతో కూడిన యూనివర్సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగి తా రాణా, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, కమిషనర్ కాలేజ్, టెక్నికల్ ఎడ్యుకేష న్ దేవసేన, కాకతీయ ఈ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రతాపరెడ్డి, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ వి రామచంద్రన్, సౌందర్య జోసెఫ్ పాల్గొన్నారు.
మహిళల చిరునవ్వుతోనే మనుగడ
మహిళల చిరునవ్వుతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఆర్టిసి బస్టాండ్ నం దు 200 కోట్ల ఉచిత ప్రయాణాల సందర్భంగా నిర్వహించిన సంబరాల కార్యక్రమం లో మంత్రి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఎస్పీ రో హిత్ రాజు,స్థానిక సంస్థల అదనపు విద్యాచందన, కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేం దర్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏ ర్పడిన రెండవ రోజే సోనియాగాంధీ జన్మదిన సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
ముస్లింల అభివృద్ధికి కృషి
పేద ముస్లిం ప్రజల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం న గరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముస్లిం మైనారిటీ సోదరుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ఖమ్మం నగరానికి 4 పక్కల 4 ఖబరస్తాన్ లు ఏర్పాటు చేయాలని ప్రభు త్వం ఏర్పడిన వెంటనే స్థానిక కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశామని, గత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హయాంలో ఖబరస్తాన్‌ల ఏ ర్పాటుకు కృషి చేసి భూమి కేటాయించడం లో కీలకపాత్ర పోషించారని మంత్రి ప్రశంసిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జి ల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పురంధర్, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, ముస్లిం ప్రతినిధులు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.