calender_icon.png 21 July, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ జిల్లా కేశపట్నంలో పోడు రగడ

21-07-2025 12:57:20 AM

-అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు పోలీసు బందోబస్తుతో వెళ్లిన ఫారెస్ట్ సిబ్బంది

-అడ్డుకుని కర్రలు, రాళ్లతో దాడిచేసిన ముల్తానీలు 

-11మంది ఫారెస్ట్, పోలీస్ సిబ్బందికి గాయాలు

ఆదిలాబాద్, జూలై 20 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పోడు రగడ నెలకొంది. గత కొన్నాళ్లుగా అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ సిబ్బంది వెళ్లగా స్థానిక పోడు రైతులు వారిని అడ్డుకుంటున్న ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో పోడు రగడ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివా రం కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 71, 72 కంపార్ట్‌మెంట్‌లోని పోడు భూముల్లో హరితవనం కార్యక్రమంలో భాగంగా మొక్క లు నాటేందుకు అటవీ శాఖ అధికారులు తమ సిబ్బందితో పాటు భారీ పోలీస్ బందోబస్తుతో వెళ్లారు.

దీంతో స్థానికంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ముల్తానీలు (వీరు పోడుతో పాటు కలప అక్రమ రవా ణా చేస్తుంటారు. ముల్తానీలు లాబానా జాతి కి చెందిన మైనార్టీలు. ఉత్తర భారతదేశం నుంచి వీరు నిజాంల కాలంలోనే ఆదిలాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు) అటవీ శాఖ సిబ్బందిని అడ్డుకున్నారు. ముల్తానీలు, అటవీశాఖ సిబ్బంది మధ్య మాటామాట పెరిగి ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో ముల్తానీలు కర్రలు, రాళ్లతో ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులపై దాడికి దిగారు.

ఈ ఘటనలో 11మంది ఫారెస్టు సిబ్బందికి, పోలీసులకు గాయాలు కాగా, అందులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముల్తానీలు కర్రలు, రాళ్లతో దాడి దిగడంతో చేసేదేమీ లేక ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ముల్తానీలు దాడుల్లో పోలీసు, అటవీశాఖకు చెందిన పలు వాహనాలు ధ్వంసం అయ్యా యి. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, దాడికి సంబంధించిన పలు వివరాలపై కూపీలాగుతునట్లు సమాచారం.