calender_icon.png 21 July, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంధకారంలో తాలిపేరు వంతెన..

21-07-2025 12:40:17 AM

- పొంచి ఉన్న ప్రమాదం

- ఏళ్లు గడుస్తున్నా ఇదే పరిస్థితి 

- వంతెనపై ప్రయాణం అధ్వానం

- పట్టించుకోని సంబంధిత అధికారులు 

- ఏజెన్సీలో పల్లె ప్రాంతాల అభివృద్ధి అంటే ఇదేనా?

చర్ల, జూలై 20, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ , దం డిపేట గ్రామాల మధ్య గల తాలిపేరునది, గోదావరి సంఘమాలకి అనుసంధానంగా ఏర్పాటు చేసిన తాలిపేరు వంతెన నిర్మాణం పూర్తి చేసుకొని ఏళ్ళు గడుస్తున్న ఇప్పటి వ రకు ఈ వంతెనపై విద్యుత్ దీపాలు లేకపోవడం శోచనీయం.

రాత్రి సమయాలలో వం తెన పై చిమ్మ చీకటి ఉండడంతో ప్రమాదా లు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఈ వంతెనపైన ప్రమాదాలు జరిగి ప్రాణాలు కో ల్పోయిన దాఖలాలు లేకపోలేదు, భద్రాచ లం డివిజన్లో భద్రాచలం గోదావరి వంతెన తరువాత అతిపెద్ద వంతెన ఏదైనా ఉంది అంటే అది ఈ డివిజన్లో తాలిపేరు వంతెన గా చెప్పవచ్చు. అటువంటి తాలిపేరు వంతె న అంధకారంలో ప్రమాదాలకు నెలవుగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వంతెనపై ఉన్న మా డ్యులర్ ఎక్సపాన్షన్  జాయింట్లు , ఫింగర్ జాయింట్ లు పూర్తిగా పాడైపోవడంతో  ని త్యం నడిపే వాహనదారులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వంతెన పై ప్రయాణం చే యాలంటేనే ప్రయాణికు విసుగెత్తిపోతున్నా రు,  చర్ల మండలంలో గల తాలిపేరు వంతె న ద్వారా  చతిస్గడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల నుండి వాహనాల ద్వారా రాకపోకలు ఈ వంతెనపైనే సాగిస్తుంటారు.

అంతర్ రాష్ట్రాలకు ప్రధాన అనుసంధాన మార్గంగా ఉన్నటువంటి ఈ వంతెన పై విద్యుత్ దీపాలంకరణ లేకపోవడం చూస్తూవుంటే  పల్లె ప్రాంతాల అభివృద్ధి ఏ దశలో ఉందో అర్థమవుతుంది, నిత్యం ప్రయాణికులు అవస్థ పడుతున్న సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం, అభివృద్ధికి బా టలు వేయకపోవడంతో మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధిక లోడు లారీల  ప్రయాణం

ఈ ప్రాంతంలో ఇసుక క్వారీలు ఎక్కువ గా ఉండడంతో నిత్యం పదుల సంఖ్యలో లారీల రద్దీ విపరీతంగా పెరిగింది . ఇసుక ర్యాంపులకు చర్ల ప్రధాన అడ్డా కావడంతో సుదూర ప్రాంతాల నుంచి టిప్పర్ల , భారీ లా రీలు, కంటైనర్ల ద్వారా చర్ల నుంచి వెంకటాపురం మీదుగా రాష్ట్ర రాజధానికి ప్రయాణం చేయడంతో ఏకనగూడెం సమీపంలో వం తెన కుంగి పోవడంతో నూతన వంచన ని ర్మాణం చేపడుతున్నా విషయం తెలిసిందే.

దానికి గల ప్రధాన కారణం అధిక సంఖ్యలో భారీ లారీలు ఆ వంతెన పై ప్రయాణం చే యడమే ప్రధాన కారణం చెప్పవచ్చు. అదేవి ధంగా చర్ల నుండి భద్రాచలం మీదుగా ని త్యం లారీలు ప్రయాణం చేయడంతో  వంతెనపై  ఉన్న మాడ్యులర్ ఎక్స్ పాన్సన్  జా యింట్లు, ఫింగర్ జాయింట్లు  పూర్తిగా దెబ్బతిన్నాయి దీంతో ఈ వంతెన పై ప్రయాణం ప్రమాద భరితంగా మారింది, మూడున్నర ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

చర్లకు కలెక్టర్, మంత్రులు వస్తున్న సమస్య తీరడం లేదు

 గత మూడేళ్లల్లో చర్ల మండలానికి వ చ్చిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నా యకులు ఇదే వంతెనపై ప్రయాణం చేసిన వారిలో  జిల్లా కలెక్టర్లు అనుదీప్ దురిసెట్టి, ప్రియాంక అలా, జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి,రాహుల్ వంటి అధికారులు పలుమార్లు ఈ తాలిపేరు వంతెనపై  ప్రయాణం చేసిన వంతెన సమస్య పరిష్కారం కానీ పరిస్థితి నెలకొంది. 

కొన్ని రాజకీయ పార్టీలు ఎ న్నికల సమయంలో వాగ్దానాలు చేస్తూ ఉ న్నారే తప్ప అభివృద్ధి పనులు చేయడం లేద ని ప్రజలు వాపోతున్నారు, చర్ల మండలానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే పొదేం వీరయ్య, ప్ర స్తుత భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే  తెల్లం వెంకట్రావు , బిఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాములో రాష్ట్ర చీఫ్ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, మంత్రి పువ్వాడ అజయ్ కు మార్, ఎమ్మెల్సీ తాతా మధు, రాకేష్ రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేం ద్రమంత్రి బలరాం నాయక్, రాష్ట్ర వ్యవసా య, నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మల నా గేశ్వరరావు, రెవెన్యూ గృహ నిర్మాణ ,ప్రచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , గిరిజన, పంచాయితీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, బిజెపి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కుం జా సత్యవతి, మంత్రి సీతారామనాయక్, సి పిఎం పార్టీ ఎమ్మెల్యే స్వర్గీయ సున్నం రాజ య్య, కేంద్ర మంత్రి బృందాకరత్, వంటి ముఖ్య నాయకులు ఈ ప్రాంతానికి ఈ రహదారి గుండా ప్రయాణం చేసినప్పటికీ వీరికి ప్రజా సమస్యలు కనిపించకపోవడం శోచనీయం, ప్రస్తుత కాలంలో ఈ వంతెన పై  ప్రయాణం చేసిన రాజకీయ నాయకులకు ఈ వంతెన సమస్య కనబడకపోవడం పార్టీల స్తానిక ముఖ్య నాయకులు ఈ సమస్యను వారి వద్ద లేవనెత్తకపోవడం వంటివి చూస్తా ఉంటే ఏజెన్సీలో అభివృద్ధికి రాజకీయ పార్టీలు ఏరకంగా దోహదపడుతు న్నాయో అర్థమవుతుంది.

సంబంధిత జిల్లా   అధికారులు ఇకనైనా స్పందించి వంతెన పై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి మాడ్యులర్ ఎక్స పాన్షన్ ను వెంటనే ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు..

వంతెనపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి 

తాళ్లపేరు వంతెనపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. రాత్రి వేళల్లో చిమ్మటి చీకటిగా ఉండటంతో ప్రమాదాలు పొం చి ఉన్నాయి, ఏజెన్సీ అభివృద్ధి అంటూ ప్రభుత్వం మూకదంపు డు ఉపన్యాసాలు ఇస్తుంది తప్ప సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదు. వం తెన పై మ్యాడ్యులర్ ఎక్స్పెన్సివ్ జాయిం ట్లు, ఫింగర్ జాయింట్లు పూర్తిగా శిథిలమై వాహనాలు దెబ్బతింటున్నాయి. తక్షణమే వాటి మరమ్మత్తు చేపట్టాలి.

 మడకన్ చందు (ఎర్రంపాడు)