21-07-2025 02:05:18 AM
వర్షాకాలం మొదలైన నుంచి 203 మంది మృతి
ఇస్లామాబాద్, జూలై 20: పాకిస్థాన్‌ను కుండపోత వర్షాలు అతలాకుత లం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు పలు ప్రాం తాలు జలమయం అయ్యాయి. వర్షాకాలం మొదలైన నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో వర్షాల వల్ల 203 మంది మరణించారు. పంజాబ్, ఖైబర్ పఖ్తూంఖ్వా, బలూచిస్తాన్, సింధ్, గిల్గిట్ ప్రాంతాల్లో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.
ఈ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రూ. 3 వేల కోట్ల నష్టం సంభవించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధార ణం కంటే 190 శాతం వర్షాలు అధికంగా కురిశాయి. ఈ వర్షాల ప్రభావం తో పాక్‌లోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.