calender_icon.png 21 July, 2025 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శశిథరూర్‌తో మనకు సంబంధం లేదు

21-07-2025 02:07:44 AM

సీనియర్ కాంగ్రెస్ నేత మురళీధరన్ 

తిరువనంతపురం, జూలై 20: గత కొద్ది రోజులుగా తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు ఆ పార్టీతో అభిప్రాయవిభేదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ లైన్ దాటి శశిథరూర్ వ్యవహరిస్తున్నారని చాలా మంది విమర్శిస్తూ వస్తున్నారు.

తాజాగా ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత మురళీధరన్ బాంబు పేల్చారు. ‘థరూర్ తన వైఖరి మార్చుకునేంత వరకు తిరువనంతపురంలో నిర్వహించే కాంగ్రెస్ ఏ సమావేశానికి కూడా ఆహ్వానించం. అతడు ప్రస్తుతం మాతో లేడు. కావున అతడిని బహిష్కరిస్తున్నామనే సమస్యే ఉత్పన్నం కాదు’ అని అన్నారు. థరూర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మెంబర్.