18-11-2025 06:22:42 PM
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమయంలో నకిలీ, మరణించిన ఓటర్లను చేర్చకుండా నిరోధించడానికి ఎన్నికల సంఘం కృత్రిమ మేధస్సు ఆధారిత ధృవీకరణ వ్యవస్థలను ప్రవేశపెట్టనుందని సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. ఓటరు డేటాబేస్‌లో ఓటర్ల ఫోటోలను, వలస కార్మికుల ఫోటోలను దుర్వినియోగం చేయడంపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో వ్యక్తులను గుర్తించేందుకు తాము ఏఐ సహాయం తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
రోల్స్‌లోని బహుళ ప్రదేశాలలో ఒకే ఓటరు ఐడీపై కనిపించే సందర్భాలను గుర్తించడానికి AI- ఆధారిత ముఖ సరిపోలిక సాంకేతికత ఉపయోగించబడుతుందని ఆయన చెప్పారు. అయితే, బూత్ స్థాయి అధికారులు (BLO) ధృవీకరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటారని అధికారు పేర్కొన్నారు. ధృవీకరణకు ఏఐ సహాయం చేస్తుంది. కానీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినప్పటికీ, బీఎస్ఓల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. వారు ఇంటింటికీ తిరిగి సందర్శించి ఓటర్ల ఫోటోలను నేరుగా తీయవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
బూత్-స్థాయి ఏజెంట్లు (BLAలు) పూర్తి చేసిన ఫారాలను సమర్పించినప్పుడు కూడా, సంతకం ధృవీకరణ కోసం బీఎస్ఓలు వ్యక్తిగతంగా ఇంటిని సందర్శించాల్సి ఉంటుంది. బీఎస్ఓలు తమ సమక్షంలోనే ఫారమ్‌లు నింపబడ్డాయని నిర్ధారిస్తూ ఓటర్ల నుండి చేతితో రాసిన ప్రకటనలను కూడా పొందుతారని అధికారి వెల్లడించారు. గణన, ఫారమ్ నింపడం పూర్తయిన తర్వాత ఏదైనా నకిలీ, మరణించిన ఓటరు గుర్తించబడితే, ఆ బాధ్యత సంబంధిత పోలింగ్ స్టేషన్ బీఎల్ఓపై ఉంటుందని సీనియర్ అధికారి వెల్లడించారు.