18-11-2025 07:15:56 PM
టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి
నూతన కార్యవర్గానికి ఘన సన్మానం
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): జర్నలిస్టులు సమాజ నిర్దేశకులని, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారధిలా పనిచేస్తున్నారని కొనియాడారు. మంగళవారం స్థానిక వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లా శాఖ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గాన్ని వారు అభినందించి, శాలువలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు, ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణ్ రావు, రాష్ట్ర కార్యదర్శి హర్మిందర్ సింగ్, జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి డబ్ల్యూజెఐ నూతన అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డి, ఉపాధ్యక్షుడు మొగురం రమేష్, సంయుక్త కార్యదర్శి గంగిపల్లి రమేష్, కోశాధికారి చిటుమల్ల మహేందర్, కార్యవర్గ సభ్యులు అనుగు శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ తదితరులను శాలువాలతో సన్మానించారు. డబ్ల్యూజేఐ నూతన కార్యవర్గం జర్నలిస్టుల ఐక్యత,హక్కుల సాధన కోసం కృషి చేస్తుందనే ఆశాభవాన్ని ఎన్జీవోల నాయకులు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.సత్యనారాయణ పాల్గొన్నారు.