18-11-2025 07:08:37 PM
తాండూరు,(విజయక్రాంతి): విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లకూడదని, వాటి వల్ల వాటి వల్ల తీవ్ర అనర్థాలు జరుగుతాయని, మత్తు పదార్థాలు ఎక్కడన్నా విక్రయిస్తే సమాచారాన్ని అందజేయాలని వికారాబాద్ జిల్లా తాండూర్ ఎక్సైజ్ సీఐ కోరారు. నషాముక్తభారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం తాండూర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి ఆధ్వర్యంలో ప్రభుత్వం జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి వాల్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు కష్టపడి ఇష్టంగా చదువుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ యాదగిరి మాట్లాడుతూ రకరకాలుగా వస్తున్న మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అమ్మానాన్నల కోరుకున్న కోరికలను నెరవేర్చే మార్గంలో వెళ్లాలని ఆయన విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ వల్ల కలిగే హనీని ఆయన వివరించారు.