calender_icon.png 18 November, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

18-11-2025 06:59:26 PM

నకిరేకల్ (విజయక్రాంతి): మండలంలోని నోముల గ్రామానికి చెందిన పగిళ్ల సైదమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. మంగళవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దహన సంస్కారాల నిమిత్తం రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి జాన్ రెడ్డి, నాయకులు కుంచం సోమయ్య, సామ రవీందర్ రెడ్డి, కందాల వెంకటరెడ్డి, పొట్ట బత్తుల వెంకటేశం తదితరులు ఉన్నారు.