calender_icon.png 18 November, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు గ్రీన్ గ్రోవ్ విద్యార్థుల ఎంపిక

18-11-2025 07:16:28 PM

చిట్యాల (విజయక్రాంతి): హైదరాబాద్ లోని  అయ్యప్ప సొసైటీ మాదాపూర్ సి.జి.ర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో నవంబర్ 16 ఆదివారం రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలు నిర్వహించారు. పోటీలలో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాలకు చెందిన రాధారపు భవ్య శ్రీ, స్టాండ్ బై లో పోకల ప్రీతి జెస్సి, రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపిక అయ్యారు.

ఈ పోటీలలో ఎంపికైన విద్యార్థులు డిసెంబర్ 5 నుంచి 7 వరకు మహారాష్ట్ర లోని బాద్లాపూర్ లో జరిగే 35 వ జూనియర్ జాతీయస్థాయి త్రోబాల్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల సామాజిక స్ఫూర్తిని కలిగిస్తాయని , ఆటల వల్ల శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, సమాజంపై అవగాహన కలుగుతుందని అన్నారు. అంతే కాకుండా విద్యార్థులకు భవిష్యత్తులో క్రీడా విభాగంలో ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోలా గోవర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు జాతీయస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.