calender_icon.png 18 November, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వసతి గృహాల విద్యార్థుల వస్తువులు, పరికరాలకు టెండర్లు

18-11-2025 07:14:13 PM

ఖరారు చేసిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు అందించేందుకు వస్తువులు, పరికరాల కోసం టెండర్లు పిలువగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమక్షంలో మంగళవారం ఓపెన్ చేశారు. విద్యార్థులకు అందించేందుకు జామెట్రీ బాక్స్, స్కేల్, వరల్డ్ మ్యాప్, వాటర్ బాటిల్, ఆల్ ఇన్ వన్ బుక్స్, స్టడీ చైర్, దుప్పట్లు, మెత్తలు, సీసీ కెమెరాలు, రగ్గులు, మొదలైన వస్తువుల కోసం టెండర్లు ఆహ్వానించి, అట్టి దరఖాస్తులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయా వస్తువుల నాణ్యతను పరిశీలించి, వాటి ధరను ఫైనల్ చేశారు. వారంలోగా ఆయా వస్తువులు అందించాలని, వాటి నాణ్యతను పరిశీలించి తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి, జిల్లా పశు వైద్యాధికారి రవీందర్ రెడ్డి, నాణ్యత కమిటీ సభ్యులు హనుమంతు, స్వప్న, ఏ ఎస్ డబ్ల్యూఓ విజయలక్ష్మి, హెచ్డబ్ల్యూఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.