calender_icon.png 18 November, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

18-11-2025 07:09:22 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పట్టణంలోని సందీప్ నగర్ లోని సిఎస్ఐ సెయింట్ జాన్ చర్చ్ ఆధ్వర్యంలో హైదరాబాదుకు చెందిన యు ఫీడ్ థెం ఆర్గనైజేషన్ వారి సహకారంతో మంగళవారం చర్చి ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ కు చెందిన వైద్యాధికారులు శిబిరానికి వచ్చిన రోగులను పరీక్షించారు. పట్టణంలోని ఆయా కాలనీలకు చెందిన ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 417 మంది పరిక్షలు చేసుకున్నారు.

కంటి పరీక్షలు, ఈసీజీ, స్కానింగ్ తదితర పరీక్షలను నిర్వహించారు. కంటి పరీక్షల అనంతరం దృష్టిలోపం ఉన్నవారికి కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ వి రాజశేఖర్ వైద్యాధికారులు ఆల్ఫ్రెడ్, నందిని రెడ్డి, ప్రమోద్ చంద్ర, నిర్మలా జైన్, జితేంద్ర, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ప్రణీత్ సభ్యులు రాజేశ్వరి, లలిత పాల్గొన్నారు.