calender_icon.png 18 November, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ కొత్త టౌన్ ఫీడర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

18-11-2025 07:12:36 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన 33 కె.వి. విద్యుత్ ఉపకేంద్రాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సందర్శించి గ్రామానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొత్త టౌన్ ఫీల్డర్ను ప్రారంభించారు.సుమారు 5 లక్షల విలువైన పీడర్ ఏర్పాటు ద్వారా తాండూర్ గ్రామ ప్రజలకు ఇకపై నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుందని దీనితో విద్యుత్తు అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయని ఎమ్మెల్యే మదన్మోహన్రావు తెలిపారు.

గ్రామస్తులు తరచు ఎదుర్కొంటున్న కరెంటు కోతల సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా దానితో ప్రత్యేక టౌన్ ఫీడర్ ఏర్పాటు చేయించారు.ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని గ్రామస్తులు అభినందించారు. అదేవిధంగా ఇటీవల పెద్ద ఆత్మకూరు గ్రామానికి చెందిన జిపివర్కర్ బాబా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదంలో మరణించారు.

వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫు నుండి ఆర్థిక సహాయంగా 5 లక్షల రూపాయల చెక్కును మృతుని భార్య సబేర వేగానికి అందజేశారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ముందున్నాడని గ్రామస్తులు ప్రశంసించారు.అలాగే తాండూర్ త్రిలింగేశ్వర ఆలయంనీ సందర్శించి సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులతో కలిసి పాల్గొన్నారు.అనంతరం రామేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఎల్లారెడ్డి నియోజకవర్గ అందరికీ స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని శివుని వేడుకున్నారు.