calender_icon.png 17 May, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీఐఐసీ భూములు పరిశీలించిన ఈడీ నిఖిల్ చతుర్వేది

17-05-2025 07:36:47 PM

గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కుల కోసం కేటాయించిన  భూములను టీజిఐఐసి ఈడి నిఖిల్ చతుర్వేది శనివారం పరిశీలించారు. సిద్దిపేట జిల్లా ములుగు, వర్గల్ మండలాల్లో టీజిఐఐసి ఈడి నిఖిల్ చక్రవర్తి(TGIIC ED Nikhil Chakraborty) పర్యటించారు. వర్గల్, ములుగు మండలాల్లోని ములుగు, పీర్లపల్లి, కొత్తూరు, వర్గల్, తునికి బొల్లారం గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. సుమారు వెయ్యి ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టీజిఐఐసి ఈడి నిఖిల్ చక్రవర్తి తెలిపారు.

ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ఇప్పటి వరకు సేకరించిన భూమి వివరాలు, ఇంకా సేకరించాల్సిన భూమి ఎంత?  సేకరించిన భూములకు సంబంధించి ఏమైనా వివాదాలు ఉన్నాయా అని ఈడి జిల్లా ఉన్నతాధికారులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఈడి నిఖిల్ చక్రవర్తి తో పాటు సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ అబ్దుల్ హమీద్, జీడిమెట్ల జోనల్ మేనేజర్ అనురాధా, టీజిఐఐసి డిజిఎం  లు రామ్ దేవ్ , నాగరాజు , స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.