17-05-2025 07:33:32 PM
సీబీఎస్ఈ పద్ధతిలో బోధనా తరగతులు..
భద్రాద్రి (విజయక్రాంతి): తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల(Telangana Tribal Ekalavya Model Residential School)లో 2025-26 సంవత్సరమునకు గాను గిరిజన విద్యార్థినుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. టీజీ ఈఎంఆర్ఎస్, పాల్వంచ రామవరం, (సిఓఈ) పాఠశాలలో, ఎంపీసీ-1 బైపీసీ-6,సీఈసీ-26, గ్రూపులలో ఖాళీలు కలవు. దరఖాస్తుతో పాటు అన్ని అర్హతలు కుల, ధ్రువీకరణ పత్రములను జతచేసి, ఈనెల 24వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు, సంబంధిత ప్రిన్సిపల్ కు సమర్పించాలి.
ఈ దరఖాస్తు చేసుకున్న విద్యార్థినిలు మార్క్స్ జిపిఏ, ఆధారంగా ఎంపిక చేయబడును. 26వ తేదీ ఉదయం 10 గంటలకు టీజీ ఈఎంఆర్ ఎస్, భద్రాచలం చర్ల నందు కౌన్సిలింగ్ నిర్వహించబడును. దరఖాస్తు చేసుకున్న విద్యార్థినిలు మిగిలిన సీట్ల గాను, అదే తేదీన స్పాట్ కౌన్సిలింగ్ కలదు. తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో, ఎంపికైన విద్యార్థినిలకు ఉచిత వసతి, భోజనము, నోట్ పుస్తకాలు, బెడ్స్ దుస్తులు, పలు వసతులు కల్పించబడును. మిగిలిన వివరాలకై ప్రిన్సిపల్ పాల్వంచ ఫోన్ నెంబర్ను(918777795179) సంప్రదించగలరు.