calender_icon.png 30 July, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం వద్ద ఉరకలేస్తున్న కృష్ణమ్మ

30-07-2025 01:51:47 AM

  1.    8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
  2. పోటెత్తిన పర్యాటకులు, భక్తజనం

నాగర్‌కర్నూల్, జూలై 29 (విజయక్రాంతి): శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ ఉరకలేస్తోంది. జలాశయంలో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరడంతో మంగళవారం రాత్రి అధికారులు 8 క్రస్ట్ గేట్లను పైకెత్తి లక్ష 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దాంతో జలపాతాల హోరు పర్యాట కులను, భక్తులను ఆకట్టుకుంటోంది. జూరాల, సుంకేసుల నుంచి 2,89,670 క్యూసెక్కులు నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతుండటం తో 882 అడుగుల వద్ద 203 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది.