calender_icon.png 8 October, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మా గంగమ్మా.. శాంతించమ్మా..

08-10-2025 05:16:15 PM

జలదిగ్బంధంలోనే ఏడుపాయల వనదుర్గమ్మ..

రాజగోపురంలోనే ఉత్సవ విగ్రహానికి పూజలు..

పాపన్నపేట (విజయక్రాంతి): దేశంలోనే రెండో వనదుర్గా మాత ఆలయం, జనమే జయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గమ్మ(Edupayala Vana Durga Bhavani Temple) చెంత గంగమ్మ మళ్ళీ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వనదుర్గమ్మ జలదిగ్బంధంలోనే ఉంది. ఆదివారం మంజీరా ఉధృతి తగుముఖం పట్టాగా ఆలయ సిబ్బంది వెళ్లి వరద ప్రవాహంతో కలిగిన నష్టాన్ని పరిశీలించారు. దీంతో మరుసటిరోజే సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు మళ్ళీ నీటిని వదలడంతో ఆలయం చెంత యధావిధిగా వరద ఉధృతి మళ్ళీ పెరిగింది. రాజ గోపురంలోనే వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మ దర్శనం కల్పిస్తున్నారు. వచ్చిన భక్తులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టగానే మూలవిరాట్ అమ్మవారి దర్శనం యధావిధిగా పునఃప్రారంభిస్తామని ఆలయ అర్చకులు, అధికారులు పేర్కొన్నారు.