24-01-2026 12:39:00 AM
పాపన్నపేట, జనవరి 23: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమ్మ వసం త పంచమిని పురస్కరించుకొని చదువుల వరదాయినిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామునే అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం, అర్చనలు నిర్వహించి సర స్వతి దేవి రూపంలో సుందరంగా అలంకరించారు. పుస్తకాలు, పెన్నులు, వీణ, వివిధ రకాల పుష్పాల అలంకరణలో అమ్మవారు శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు.