calender_icon.png 24 January, 2026 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

65 ఏళ్ల మహిళకు కొత్త జీవితం

24-01-2026 12:40:28 AM

కేర్ ఆస్పత్రి వైద్యుల ఘనత

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): జీర్ణవ్యవస్థలో అత్యంత అరుదుగా కనిపించే డ్యూడెనల్ క్యాన్సర్తో బాధపడుతున్న ఏలూరు జిల్లాకు చెందిన 65 ఏళ్ల మహిళకు మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్ వైద్యులు కీహోల్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స అనం తరం ఆమె కేవలం ఐదు రోజుల్లోనే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం విశే షంగా మారింది. డ్యూడెనల్ క్యాన్సర్ జీర్ణవ్యవస్థ క్యాన్సర్లలో ఒక శాతం కన్నా తక్కువగా కనిపించే అరుదైన వ్యాధి.

ఆపరేషన్ చాలా క్లిష్టమైనది కావడంతో పాటు ప్రమాదం ఎక్కువగా ఉండటంతో పలు ఆసుపత్రులు శస్త్రచికిత్స చేయడానికి నిరాకరించాయి. దీంతో రోగి కుటుంబం తీవ్ర మానసిక ఆందోళనకు గురై, ఆశలు కోల్పోయిన స్థితికి చేరుకుంది. కేర్ హాస్పిటల్ వైద్యులు పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించి, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత శస్త్రచికిత్సకు నిర్ణయం తీసుకున్నారు.

డాక్టర్ భూప తి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ క్లిష్టమైన సవా లును స్వీకరించింది. ఈ కేసులో తక్కువ రక్తస్థాయి, పోషకాహార లోపం, ఆహారం వెళ్ల కుండా అడ్డుకున్న పెద్ద ట్యూమర్, మృదువైన ప్యాంక్రియాస్, పేగు సమీపంలో వ్యాధి ఉండటం వంటి అంశాలు శస్త్రచికిత్సను మరింత సవాలుగా మార్చాయి.

అయినప్పటికీ ముందస్తు ప్రణాళిక, అనుభవం, బృం ద సమన్వయంతో వైద్యులు ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా రోగి వేగంగా కోలుకుంది. ఆపరేషన్ జరిగిన ఐదవ రోజునే ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఈ కేసు గురించి డాక్టర్ భూపతి రాజేంద్రప్రసాద్, మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్ల వివరించారు.