26-11-2025 12:39:37 AM
రూ.1.3 కోట్లతో ఐదు పనులకు శంకుస్థాపన
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్ అభివృద్ధి దిశగా మరో కీలకమైన ముందడుగు పడింది. డివిజన్ పరిధిలో మొత్తం రూ. 1 కోటి 3 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఐదు ముఖ్య అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథులుగా ఎల్‌బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్‌యాదవ్ హాజరై శంకుస్థాపన చేశారు. రూ.19.5 లక్షలతో జైపూరి కాలనీ పార్కు అభివృద్ధి, వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్, పెయింటింగ్, ఆర్చి నిర్మాణ పనులు చేపడుతున్నారు.
జైపూరి కాలనీ కమ్యూనిటీ హాల్‌కు రూ.29.5 లక్షలు కేటాయించారు. చాణక్యపురి కాలనీ పెద్ద పార్క్‌లో రూ.21.5 లక్షలతో ఫెన్సింగ్, పెయింటింగ్ పనులతో పాటు పార్క్ను పూర్తిగా నవీకరిస్తున్నారు. చాణక్యపురి చిల్డ్రన్ పార్క్‌లోర రూ.17 లక్షలతో పిల్లల ఆటల కోసం వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్, పెయింటింగ్ వంటి పనులు చేపట్టనున్నారు. సౌత్ ఎండ్ పార్క్ చిల్డ్రన్ పార్క్‌లో రూ.16 లక్షలతో చిన్నారుల వినోదానికి, అభివృద్ధికి అనువుగా పార్క్ ఏర్పా టు చేయబడుతోంది. అభివృద్ధి యాత్ర నిరంతరం కొనసాగుతుందని కార్పొరేటర్ చింతల అరుణ అన్నారు.
కార్యక్ర మంలో జైపూరి కాలనీ అధ్యక్షుడు శంకర్, సభ్యులు సంతోష్, శివ, వేణు, రాహుల్, వెంకట్ రెడ్డి, రాజు యాదవ్, చాణక్యపురి కాలనీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, సభ్యులు శ్రీధర్ బాబు, ఓం ప్రకాష్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, సౌత్ ఎండ్ పార్క్ కాలనీ అధ్యక్షుడు రమేష్, సభ్యులు రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, బీజేపీ నాయకులు రావుల శ్రీనివాస్‌గౌడ్, వినోద్‌రెడ్డి, నూకల పద్మారెడ్డి, జక్క గీతారెడ్డి, మునిందర్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.