18-10-2025 12:00:00 AM
డబ్ల్యూ హెచ్‌ఓ కన్సల్టెంట్ డాక్టర్ సమ్దాన్
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 17 : ఫైలేరియా (బోదకాలు) వ్యాధి నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డబ్ల్యూ హెచ్ ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) కన్సల్టెంట్ డాక్టర్ సమ్దాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ యు పి హెచ్ సీ పరిధిలో జరుగుతున్న టాస్ (ట్రాన్స్మిషన్ అసిస్టెంట్ సర్వే) ను శుక్రవారం ఆయన పరిశీలించి సరైన పద్ధతిలో జరుగుతుందని సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 20 టీముల ద్వారా 3,300 పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఇంకా 3000 మందికి పరీక్షలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. టాస్ సర్వే నిర్వహించే గ్రామాల్లో ప్రజలను సన్నద్ధం చేయాలని వైద్యాధికారులకు, సిబ్బందికి ఆయన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ అనిత, మలేరియా సబ్జెక్ట్ అధికారి శ్రీనివాస్, టెక్నికల్ సూపర్వైజర్ సంతోష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.