calender_icon.png 6 August, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలి

06-08-2025 01:15:37 AM

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 05 (విజయక్రాంతి)అనంతరం ఏఎస్పీ  మాట్లాడుతూ....నేర విచారణ,నేర నిరూపణ సమర్థవంతంగా చేయడం ద్వారానే నిందితులకు శిక్షలు పడే అవకాశం ఉం టుందని, పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ త్వరగతిన పరిష్కరించాలని ఆదేశించారు.సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న కేసులపై సబ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లు తరచు రివ్యూ చేస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి  కృషి చేయాలన్నారు.

సబ్ డివిజన్ పరిధిలో తరుచుగా నేరాలకు పాల్పడే నేరస్థులపై రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేగుర్తించి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని,జిల్లాలో ఉన్న రౌడి షీటర్స్ పై నిఘా కఠినతరం చేసి తరచు తనిఖీ చేస్తూ వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.నిషేధిత గంజా యి, అక్రమ ఇసుక రవాణా పీడీఏస్ బియ్యం అక్రమరవాణా,జూదం లాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిని గుర్తించి కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు.గ్రామాల్లో పట్టణాల్లో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారిస్తు విలేజ్ పోలీస్ అధికారులు తరచు గ్రామాలు సందర్శిస్తూ ప్రజలలో సస్స బంధాలు మెరుగుపర్చుకోవాలన్నారు.

కమ్యూనిటీ పోలీసింగ్ లో బాగంగా ప్రజలకు సైబర్ నే రాలు, గంజాయి వలన కలుగు అనర్ధాలపై, చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ లు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో సి.ఐ  వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లు, సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.