calender_icon.png 6 August, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీచైతన్య కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

06-08-2025 01:13:27 AM

కరీంనగర్, ఆగస్టు 5 (విజయ క్రాంతి): శ్రీచైతన్య కళాశాలలో మంగళవారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ సంవత్సర విద్యార్థులు ఆటపాటలతో స్వాగతం పలికారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, భాద్యతయుతమైన చదువు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదిస్తుందని తేలియజేశారు.

కావున విద్యార్థినీ విద్యార్థులు రాబోయే పోటీ ప్రపంచానికి అను గుణంగా తమను తాము తీర్చిదిద్దుకొని అటు తల్లిదండ్రులకు ఇటు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ మల్లారెడ్డి, రాధాక్రిష్ణ, మోహన్రావు, ఎజియం శ్రీనివాస్, అధ్యాపక, అధ్యాపకేతర బృందంపాల్గొన్నారు.