calender_icon.png 2 August, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.470కోట్లతో పాలేరులో విద్యాభివృద్ధికి కృషి

01-08-2025 12:00:00 AM

  1. 8 నుంచి ఇంటర్ వరకు చదివే ఆడపిల్లలకు సైకిల్స్ పంపిణీ

కూసుమంచి జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన,

విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం, జూలై 31 (విజయక్రాంతి): గత 20 నెలల కాలంలో 470 కోట్ల రూపాయలను విద్యా రంగంలో పాలేరు నియోజకవ ర్గానికి మంజూరు చేశామని,ఎన్ని ఆర్థిక ఇ బ్బందులు, కష్టాలు ఉన్నా పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌ జింగ్, సమాచార పౌరసంబంధాల శా ఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా రు.

మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి గురువారం కూసుమంచిలో ప ర్యటించి 5 కోట్ల 50 లక్షల అంచనా వ్య యం తో నిర్మించనున్న జూనియర్ కళాశాల భవ న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, జిల్లా పరిషత్ హైస్కూల్ లో పి.ఎస్.ఆర్. ట్రస్ట్ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిళ్ల పం పిణీ, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మం త్రి మా ట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీ ప్రకారం కూసుమంచి మండలంలో 5 కోట్ల 50 లక్షలతో జూనియర్ కళాశాల ని ర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాకుం డా, డిసెంబర్ చివరి వరకు పనులు పూర్తి చే సి జూనియర్ కళాశాలను ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తామని అన్నారు.పాలేరు ని యోజకవర్గంలో 8 నుంచి 10వ తరగతి చ దివే ఆడ పిల్లలకు గత సంవత్సరం సైకిళ్ళను పంపిణీ చేశామని అన్నారు.

ప్రస్తుతం 8వ తరగతి వచ్చిన విద్యార్దినులకు సైకిళ్ళు పంపి ణీ చేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం 8 నుంచి ఇంటర్ వరకు చదివే బాలికలకు సైకిల్స్ అందిస్తానని అన్నారు.విద్యారంగం లో కాస్త వెనుకబడి ఉన్న పాలేరు నియోజకవర్గాన్ని విద్య పట్ల అన్ని రకాలుగా అభి వృద్ధి చేస్తామని అన్నారు. 200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులం, 208 కోట్లతో జే.ఎన్.టి.యూ.

ఇంజనీరింగ్ కాలేజీ, 46 కోట్లతో ఐటిఐ కళాశాల, 5.5 కోట్ల జూనియర్ కళాశాల, తిరుమలాయపాలెం హాస్టల్ 2 కోట్ల 70 లక్షలు మంజూ రు చేయడం జరిగిందని అన్నారు. పాఠశాలలో 3 కంప్యూటర్ ట్రైనింగ్ ట్యూటర్ లను నియమించేందుకు 3 లక్షల నిధులు మంత్రి మంజూరు చేశారు. పాఠశాల కాంపౌండ్ వాల్ తో పాటు పాఠశాలకు ఆదాయం వ చ్చేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని అన్నారు.

అనంతరం కూసుమంచి మండలానికి చెందిన 75 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశా రు.ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు సైకిళ్లను అందజేసి మంత్రి, జిల్లా కలెక్టర్ స్కూల్ ఆవరణలో సైకిల్ నడిపి పిల్లల్లో ఉత్సాహం నిం పారు.ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, కూసుమంచి మండల తహసీల్దార్ రవికుమార్, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంచార్జీ తుంబూరు ద యాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరు లు పాల్గొన్నారు.