calender_icon.png 22 November, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి

18-08-2024 12:19:06 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

కార్వాన్‌లో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలల బలోపే తానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పాఠశాలల్లో శానిటేషన్, స్క్రావెంజర్ పనుల కోసం ప్రతి నెలా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. శనివారం కార్వాన్ కుల్సుంపురాలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడు తూ.. రాష్ట్రంలోని 25వేల ప్రభుత్వ పాఠశాలల్లో రూ.1,100కోట్లతో మౌలిక సదుపాయా లు కల్పిస్తున్నామన్నారు. కుల్సుం పురా పాఠశాలలో టాయిలెట్స్, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.  

గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

నగరంలో సెప్టెంబర్ నెలలో జరిగే గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికా రులను ఆదేశించారు. శనివారం బంజా రాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రో ల్ సెంటర్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు జరిగే  గణేష్ ఉత్సవాల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

నగరంలోని ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీలతో వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ సంస్థలు, ఎన్జీవోల ద్వారా మట్టి విగ్రహాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కే.శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్‌మాన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి పాల్గొన్నారు.