18-08-2024 12:18:03 AM
పార్కింగ్ ఫీజులను ఉపసంహరించుకోవాలి
మెట్రో రైల్ భవన్ ఎదుట సీపీఎం నేతల ధర్నా
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి) : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రో రైల్ బోగీలను మూడు నుంచి ఆరుకు పెంచడంతో పాటు నూతనంగా ప్రవేశపెట్టిన పార్కింగ్ ఫీజులను ఉపసంహరిం చుకోవాలని సీపీఎం హైదరాబాద్ సెంట్రల్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రసూల్‌పురాలోని హైదరాబాద్ మెట్రో రైల్ భవన్ ఎదుట శనివారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పీక్ అవర్స్‌లో బ్లూలైన్, రెడ్‌లైన్‌లో ప్రయాణించడం కష్టంగా మారిందని విమర్శించారు. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో ఇప్పటివరకు ఫ్రీగా ఉన్న పార్కింగ్‌ను యథా తథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎల్‌అండ్‌టీకి ఆదాయం, లాభాలు తప్ప ప్రజల ఇబ్బందులు పట్టడంలేదని ఆరోపించారు. కోచ్‌ల సంఖ్య పెంచా లని గతకొం తకాలంగా ప్రయాణికులు కోరుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మెట్రో ఎండీ ఎన్వీఎస్.రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు శ్రీనివాస్‌రావు, దశరథ్, మహేందర్, నాగలక్ష్మి, జావీద్, రాజన్న, రాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.