862 కిలోల గంజాయి దహనం
03-12-2024 01:29 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ గంజాయిని పోలీసులు దహనం చేశారు. జిల్లా లో ఇటీవల నమోదైన 14 కేసుల్లో పట్టుబడ్డ 862 కిలోల గంజాయిని నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి వద్ద గల శ్రీ మెడికేర్ సరీసెస్ సెంటర్‌లో గంజాయి డిస్పోజల్ కమిటీ ఆధర్యంలో దహనం చేశారు. ఈ ప్రక్రి యను ఎస్పీ గౌష్ ఆలం సయంగా పరిశీలించారు. కమిటీ సభ్యులు డీసీఆర్బీ డీఎస్పీ సురేందర్‌రెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, డీసీఆర్బీ ఎస్సై హకీమ్ గంజాయిని దహనం చేయించారు.






