calender_icon.png 16 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టబద్ధంగానే రిజర్వేషన్లు కావాలి

16-11-2025 12:41:05 AM

-బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలి

-నేడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో బీసీల న్యాయసాధన దీక్ష  

-బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బీసీ జాబ్ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణ య్య డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో వాగ్దానం చేసిందని, పార్టీలపరంగా రిజర్వేషన్లు వద్దే వద్దని, చట్టబద్ధంగా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్లను భారత రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరణ చేసి బీసీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రాండ్స్‌లో జాతీ య బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ కో-ఆర్డినేటర్ గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు.

రాజ్యాంగాన్ని 130 సార్లు సవరణ చేశారని మెజారిటీ ప్రజలు 56% జనాభా గల బీసీల కోసం ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని సవరించకపోవడం దుర్మార్గమన్నారు. బీసీలు అనేక పోరాటాలు చేసి బీసీలను 42 శాతం సాధిస్తే కోర్టుల్లో కేసులు వేసి ఆపివేస్తున్నారని  ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను సాధించుకునేందుకు ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో చేపట్టే బీసీల న్యాయసాధన దీక్షను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, నాయకులు పాల్గొన్నారు.