12-01-2026 02:43:05 AM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ లో 15 ఎస్టీ కాలేజీ బాలికల, 10 ఎస్టీ కాలేజీ బాలుర హాస్టల్స్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం కు లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ సందర్భం గా ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ హాస్టల్ సీట్లు దొరకక విద్యార్థులు చదువు మానుకుంటున్నారన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్బల్ జిల్లాలలో కాలేజీ కోర్సులు చదివే ఎస్టీ అమ్మాయిల, అబ్బాయిల హాస్టల్స్ 25 లోపు గా ఉన్నాయని, ఇవి ఏ మాత్రం సరిపోవన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంజనీరింగ్, డిగ్రీ పీజీ పార్మసీ కాలేజీలు వేల సంఖ్యలో ఉన్నవని, ఎస్టీ అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇవి ఏ మాత్రం సరి పోవడం లేదన్నారు. పైగా ఎస్సీ, ఎస్టీల విద్యార్థులకు ప్రైవేట్ హాస్టల్స్‌లో నెలకు 5వేల ఖర్చుపెట్టి చదివే ఆర్ధిక స్తోమత లేదన్నారు.
పైగా ఎస్సీ, ఎస్టీలకు అద్దె ఇల్లు కూడా ఇవ్వడం లేదని, పైగా అద్దె రూములు తీసుకొని చదవాలంటే ఆర్ధిక, సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నా రు. సామాజిక వివక్షతో సమాజం ఇంకా చిన్న చూపు చూస్తుందన్నారు. గిరిజన విద్యార్థులు ఇప్పుడిప్పుడే ఉన్నత విద్య చదవడా నికి ముందుకు వస్తున్నారని, వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. విద్యా ర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. సీఎం చొరవ తీసుకొని కాలేజీ కోర్సులు చదివే ఎస్టీ అమ్మాయిలకు హైదరాబాద్ 5, రంగారెడ్డి 4, మేడ్చల్ 4 కాలేజ్ హాస్టల్స్ లో గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో మంజూరు చేయాలన్నారు. ఎస్టీ అబ్బాయిలకు హైదరాబాద్ 5. రంగారెడ్డి 4, మేడ్చల్ 4 కాలేజీ హాస్టల్ గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.