27-11-2025 12:00:00 AM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి) : పంచాయతీ ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచా యతీ ఎన్నికలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్లు, పోలీస్ కమిషన ర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గురువారం నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియతో పాటు భద్రత, పోలింగ్ ఏర్పాట్లపై ఎస్‌ఈసీ చర్చించారు. కాగా, గ్రామ పంచాయతీల ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మొత్తం 12,728 గ్రామా పంచాయతీలు, 1.13 లక్షల వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికలకు గురువారం నుంచి శనివారం వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది.