27-11-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, నవంబర్ 26 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ సర్కిల్ లోని కబ్జాలకు గురైన చెరువులను కబ్జాల నుంచి కాపాడాలని జాగృతి నాయకులు కప్పటి పాండురంగారెడ్డి, చలసాని విష్ణుమూర్తిలు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని ఊర చెరువు, శిలాన్ చెరువు, నూర్ మహమ్మద్ కుంట, బాబుల్ రెడ్డి నగర్ లోని నర్సాబాయి కుంటలు కొందరు రాజకీయ నాయకులు, కబ్జాదారులు చెరువులను ఆక్రమించారని తెలిపారు.