calender_icon.png 13 December, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

12-12-2025 12:08:29 AM

మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 11: జిల్లాలో రెండవ విడత  గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ విజయేందిర బోయి అన్నా. గురువారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో శిక్షణలో పాల్గొన్న ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం లో ఆమె పి.ఓ.లకు దిశా నిర్దేశం చేశారు. రెండవ విడతలో హన్వాడ, దేవరకద్ర, కోయిలకొండ, సిసి కుంట, కౌకుంట్ల, మిడ్జిల్,  మండలాల్లోని గ్రామ పంచాయతీ లకు, వార్డ్ సభ్యులకు ఈ నెల 14 న ఉదయం 7.00 నుండి 1.00  వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు.

పి.ఓ.లు పోలింగ్  ముందు రోజు సమయానికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను చేరుకొని ఎన్నికల సామాగ్రినీ స్వీకరించాలన్నారు. ఎన్నికల సామాగ్రిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని అన్నారు. బ్యాలెట్ బాక్సులు సరిగ్గా పని చేస్తున్నాయా చూసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్లు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రానివేనా, అవి సరిగ్గా ఉన్నాయా, సరిచూసుకోవాలన్నారు. పి. ఓ లు ఎన్నికల ముందు రోజే వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలను చేరుకొని ఎన్నికల నియమావళికి అనుగుణంగా పోలింగ్ బూత్ ఏర్పాట్లను చూసుకోవాలన్నారు. 

పి.ఓ లు ఎన్నికలను, ప్రశాంతంగా, పారదర్శకంగా, బాధ్యతగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల సమయంలో వారికి ఏమైనా అనుమానాలు, సమస్యలు వస్తే, పీ .ఓ.రూల్ బుక్ ని అనుసరించాలని, లేదా వెంటనే వారి పై అధికారులను, సంప్రదించాలని, సూచించారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే బ్యాలెట్ బాక్స్ సీలింగ్,  పి.ఓ. డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంట్, అటువంటి తప్పుల్లేకుండా నిర్వహించాలని సూచించారు.

మధ్యానం 2.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని, సాయంత్రం లోపు, ఎన్నికల ఫలితాలను ప్రకటించి, అదేరోజు ఉపసర్పంచుల ఎన్నిక కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా విద్యాశాఖ అధికారి,శిక్షణ నోడల్ అధికారి ప్రవీణ్ కుమార్, డివిజనల్  పంచాయతీ అధికారి రామ్మోహన్, మాస్టర్ ట్రైనర్లు శ్రీకాంత్, నాగరాజు, దుంకుడు  శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.