13-12-2025 06:12:33 PM
అశ్వాపురం (విజయక్రాంతి): మండలం పరిధిలోని స్థానిక ఎన్నికల్లో వివిధ గ్రామాల నుండి గెలుపొందిన నూతన ప్రజా ప్రతినిధులు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచులు శాలువా, పుష్పగుచ్ఛం ఇచ్చి ఎమ్మెల్యేను సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ సర్పంచులకు ఎమ్మెల్యే అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పూర్తి సహాకారం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్ లు బూరెడ్డి స్వాతి, మచ్చా నరసింహారావు, ఎట్టి నరేష్, మడకం మూలమ్మ, కోండ్రు అంజమ్మ, కుంజా జాను, తెల్లం నాగమణి, కలివేటి సరిత, పోడియం పవన్, సబ్కా పిచ్చయ్య, ఇర్పా కవిత, జిమ్మా ఝాన్సీ, ఎనిక ఉషారాణి ఉప సర్పంచ్ లు హర్షా నాయక్, ఇర్పా లక్ష్మణ్, జామా ఖాదర్, సంజీవరెడ్డి, ఎక్కటి పున్నారెడ్డి, శ్యామల వెంకటరెడ్డి, పోడియం మల్లేష్ రావు, తాటి దుర్గాదేవి, షేక్ రసూల్ భీ, ఎడమ సురే ష్, పోడియం భీమరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బూరెడ్డి వెంకటరెడ్డి, సామ కృష్ణారెడ్డి, గాదె వెంకటరెడ్డి, సజ్జా రమేష్, ఆవుల రవి, బట్టా సత్యనారాయణ, సబ్కా చిన వీరయ్య, కుంజా శ్రీను, గారపాటి వీరయ్య, లొడిగా నరసింహరావు, జిమ్మా జంపయ్య, కోర్సా కాంతయ్య, కలివేటి వెంకటేశ్వర్లు, కలువేటి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.