calender_icon.png 13 December, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

12-12-2025 12:09:42 AM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహమ్మదా బాద్, డిసెంబర్ 11: మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నంచర్ల జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో,గండీడ్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.

కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా చేయాలని అధికారులకు సూచించారు.  పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియలో పాటించవలసిన నిబంధనలు, జాగ్రత్తలు, భద్రతా చర్యలపై అక్కడే విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బంది తో మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత అసలైన బాధ్యత కౌంటింగ్ దశలో ప్రారంభమవుతుందని,  కౌంటింగ్ ప్రక్రియలో జరిగే ప్రతి చర్య ఎన్నికల పారదర్శకతను ప్రతిబింబిస్తుందన్నారు.

ఒక్క చిన్న పొరపాటు తుది ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త అవసరమన్నారు. ప్రతి టేబుల్ వద్ద సిబ్బంది శ్రద్ధగా విధులు నిర్వర్తిస్తూ అన్ని ఫారమ్లు,  నమోదు పత్రాలు పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే రౌండ్ ఫలితాలను ప్రకటించాలని చెప్పారు. ఫలితాలు పూర్తయిన తర్వాతే ఫామ్- 29 ను గెలిచిన అభ్యర్థికి సర్పంచ్ గా ఇవ్వాలని తెలిపారు.