calender_icon.png 13 December, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ మద్యం పట్టివేత..

13-12-2025 06:13:58 PM

ఎస్సై వెంకటేశ్వర్లు..

నారాయణపేట (విజయక్రాంతి): ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా నారాయణపేట మండలం పేరపల్లి గ్రామంలోని అశోక్ గౌడ్ కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం అందడంతో నారాయణపేట టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 181 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకొని నారాయణపేట టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు  65,600/- నిర్ధారించబడిందని తెలిపారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచినందుకు సంబంధిత వ్యక్తి అశోక్ గౌడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని నారాయణపేట టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం, డబ్బు పంపిణీపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.