12-12-2025 12:06:50 AM
మాజీ జేడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి
అడ్డాకుల, డిసెంబర్ 11 : నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే వారికి ప్రాముఖ్యత కల్పించాలని మాజీ జెడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచ్లుగా గెలిపించాలని అడ్డాకుల మాజీ జడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం అడ్డాకుల గ్రామంలోని వాడల్లో ఇంటింటి ప్రచారం బ్యాలెట్ లేడి పర్సు గుర్తుకు ఓటు వేయాలని మాజీ జెడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా జెడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మండల టిఆర్‌ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవని, అలాంటి వాటికి తావూ లేదని స్పష్టం చేశారు. పార్టీకి కష్టపడి, జెండా మోసి పనిచేసిన నిజమైన కార్యకర్తలకే సర్పంచ్ అవకాశాలు ఇచ్చామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బలపరిచిన బొక్కల పల్లి తిరుపతిరెడ్డి అడ్డాకుల నుంచి భారీ మెజారిటీతో గెలిపించి బీఆర్‌ఎస్ పార్టీకి బహుమతిగా అందించాలి అని జెడ్పిటిసి కోరారు.
సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 25ఏళ్లుగా గ్రామంలో సేవలు చేయడం జరిగిందని, ఊరి సర్పంచిగా నన్ను ఆదరిస్తున్నారని అందరూ సహకరిస్తున్నారని తనకు గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జితేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, శీను రెడ్డి, దానియేలు, జాంగిర్ చంద్రకాంత్, సాయన్న, డేవిడ్,అబ్రహం, నాయకులు పాల్గొన్నారు