calender_icon.png 13 December, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేలకే దిక్కు లేదు.. సర్పంచులకు ఇంకెక్కడ

13-12-2025 06:15:30 PM

బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు  ఎస్.రాజేందర్ రెడ్డి 

నారాయణపేట,(విజయక్రాంతి): గడిచిన రెండేళ్ల రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలనలో ఏకంగా ఎమ్మెల్యేలకే నియోజకవర్గ అభివృద్ధి నిధులకు నిధులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులకు ఎలా నిధులు ఇస్తుందో ప్రజలు గమనించి, సర్పంచి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని నారాయణపేట జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి(Former MLA Rajender Reddy ) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని నేను అనడం లేదని స్వయంగా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన మహబూబ్ నగర్, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈ విషయాన్ని బహిరంగంగా అంటున్నారని తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్యేకు నిధులు ఇవ్వని కాంగ్రెస్, ఇక గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఎలా నిధులు ఇస్తుందో స్పష్టంగా తెలుస్తుందని అన్నారు.  దేశంలో 20 ఉత్తమ అవార్డులు ప్రకటిస్తే అందులో 19 అవార్డులు కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్టానికి వచ్చాయని అన్నారు. కానీ నేడు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం ట్రాక్టర్లకు డీజిల్ పోసే పరిస్తితి లేదన్నారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమని, మళ్ళీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామన్నారు.

ప్రజలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను ఓడించడమే లక్ష్యంగా ఓటు వేసి బిఆర్ఎస్ మద్దతు దారులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమని అప్పుడు మళ్లీ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చేతిలో ప్రజలు మరోసారి మోసపోవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో నారాయణపేట నియోజకవర్గం లోని కోయిలకొండ మండలంలోని గార్లపాడు ను, దామరగిద్ద మండలం కాన్ కూర్తిని అదేవిధంగా నారాయణపేట మండలం కోటకొండ ను మండలంగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ రెండేళ్లయిన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కొత్త మండలాల పేరుతో నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బొంద పెట్టాల్సిన బాధ్యత నారాయణపేట నియోజకవర్గ ప్రజల చేతుల్లో ఓటు రూపంలో ఉందని, ఆ ఓటును సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీని అతో పాతాలానికి తొక్కాలని పిలుపునిచ్చారు.