calender_icon.png 22 July, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు

19-07-2025 01:26:34 AM

సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్    

జగిత్యాల అర్బన్, జూలై 18(విజయ క్రాంతి):ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యం గల వ్య వస్థ జర్నలిజం రంగం అని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు.శుక్రవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో టి.యు.డబ్ల్యు జె(ఐజేయు)ఎన్నికల్లో విజేతలను ఘనంగా సన్మా నించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సం పూర్ణ చారి,కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్,ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ,హైదరలీ,సహాయ కార్యదర్శులు గుర్రం చంద్రశేఖర్,కోరేపు రాజ్ కుమార్,చింత నరేశ్,టిన్యూస్ మనోజ్,మహిళాజర్నలిస్టు సాకేత తదితరులను సన్మానించి వారి సేవలను హరి ఆశోక్ కుమార్ కొని యాడారు.

హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని, జర్నలిస్టులకు ఆరోగ్యపథకాన్ని ప్రవేశ పెట్టాలని, ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని,చాలీ చాలని వేతనాలతో జీవితాలు గడుపుతున్న జర్నలిస్టులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.జర్నలిస్టుల జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు.

తమ అసోసియేషన్ జర్నలిస్టులను సన్మానించిన సీనియర్ సిటీజేన్స్ సంఘం అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కౌన్సెలింగ్ అధికారి పి.సి.హన్మంత రెడ్డి,ఉపాధ్యక్షు డు ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు,సంయుక్త కార్యదర్శి దిండిగాల విఠల్,యూసుఫ్,యాకుబ్ హుస్సేన్,కస్తూరి శ్రీమంజరి,గంగం జలజ, తదితరులుపాల్గొన్నారు.