calender_icon.png 2 January, 2026 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల సన్నాహాక సమావేశం

02-01-2026 09:03:15 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): రేకుర్తి-19 డివిజన్ లో మున్సిపల్ ఎన్నికల సన్నాహా సమావేశం బిజెపి పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల్లో పశ్చిమ జోన్ లో ఉన్న 12 డివిజన్లో కాషాయం జెండా ఎగురవేయాలని అన్నారు.

పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బండి సంజయ్, కరీంనగర్ కార్పొరేషన్ లో స్మార్ట్ సిటీ కి సుమారు 450 కోట్ల నిధులను తీసుకువచ్చి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేశారని అన్నారు. బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుండి మరిన్ని నిధులు తెప్పించి అభివృద్ధిలో ముందు ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని కేవలం మోడీ గారి కేంద్ర నిధులతో నే అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.