calender_icon.png 25 November, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంచి ఉన్న ప్రమాదం

25-11-2025 08:21:27 PM

కూలిపోయే దశలో కరెంటు స్తంభం..

మోతే: కరెంట్ స్థంభం కూలిపోయే దశకు చేరుకొని ప్రమాదం పొంచి ఉన్నదని.. ఎప్పుడు కూలి ఏమౌతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్డులోని రెడ్డి హోటల్ సమీపంలో ఇండ్ల మధ్యలో ఉన్న కరెంట్ స్థంభం నేషనల్ హైవేకు ప్రక్కనే ఉండటంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వారికి కరెంట్ స్థంభం చుట్టు సిమెంట్ తేలి ఇనుప సువ్వలు కన్పించడంతో పాటు స్థంభం వంగిపోయి ఇప్పుడా ఇంకా కాసేపటికా పడే ప్రమాదం సంబావిస్తున్నాదా అనే విధంగా కరెంట్ స్థంభం తీరు కనబడుతున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల విద్యుత్ అధికారులు స్పందించి కూలే దశలో ఉన్న కరెంట్ స్థంభం స్థానంలో మరొకటి మార్చి జరగబోయే పెను ప్రమాదంను నివారించాలని రాఘవపురం ఎక్స్ రోడ్డుగ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.