calender_icon.png 25 November, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ షెడ్డును కూల్చేసిన హైడ్రా అధికారులు

25-11-2025 08:22:35 PM

మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాకు అమ్మడని బాధితులు మొర

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం మున్సిపల్ చౌదరిగూడలో  800 గజాల అసైన్డ్ ల్యాండ్ కబ్జా చేసి వేసిన షెడ్డును హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేశారు. అసైన్డ్ ల్యాండ్ సర్వే నెంబర్ 8,66,867లో పర్మిషన్ లేకుండా షెడ్డు నిర్మించడంతో హైడ్రా అధికారులు కూల్చి వేశారు. మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాకు అమ్మడని బాధితులు మొరపెట్టుకున్నారు. చౌదరిగుడా కాలనీవాసుల ఫిర్యాదు మేరకు కూల్చామని హైడ్రా అధికారులు తెలిపారు. అసైన్డ్ ల్యాండ్ కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామని ఘాటుగా హెచ్చరించారు.   పర్మిషన్ లేకుండా కడితే కూల్చివేస్తామని, మళ్లీ పునరావృతం అయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.