25-11-2025 08:18:57 PM
జిల్లా వ్యవసాయ సంచాలకులు కృష్ణ
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): వరి కొయ్యలను కాల్చడం వలన పర్యావరణ కాలుష్యం, నెలలో ఉండే సూక్ష్మజీవులు నశించే అవకాశం ఉంటుందని సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణ మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులందరూ పంట అవశేషాలు కొయ్యలను నేలలో కలియ దున్నడం ద్వారా నేల కర్బన శాతాన్ని పెంచడం, సూక్ష్మజీవుల అభివృద్ధి పోషకాల యొక్క లభ్యత పెరిగి నేల సారవంతంగా మారి సూక్ష్మజీవులు వృద్ధి చెంది నేలకు అందించే రసాయన ఎరువులు కూడా మొక్కకు అంది అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కావున రైతులందరూ పంట అవశేషాలు, వరి కోయాలను కాల్చవద్దని కొరారు.