26-12-2024 12:11:27 AM
పీకేఎల్ 11వ సీజన్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. నేడు జరగనున్న ఎలిమినేటర్ పోరులో తొలి మ్యాచ్‌లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్, రెండో మ్యాచ్‌లో యు ముంబాతో పట్నా పైరేట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఎలిమినేటర్‌లో నెగ్గిన జట్లు సెమీస్‌లో హర్యానా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీతో ఆడనున్నాయి. నేటి మ్యాచ్‌ల్లో బలంగా కనిపిస్తున్న యు ముంబా, యూపీ యోధాస్ ఫేవరెట్‌గా ఉన్నాయి. ఇక ప్లేఆఫ్స్ చేరిన ఆరు జట్లలో హర్యానా, యూపీ యోధాస్ ఇంతవరకు ఒక్కసారి కూడా చాంపియన్స్ కాలేదు. పట్నా పైరేట్స్ మూడుసార్లు, జైపూర్ రెండుసార్లు, యు ముంబా, దబంగ్ ఢిల్లీ ఒక్కోసారి పీకేఎల్ టైటిల్ నెగ్గాయి.