13-08-2025 06:01:33 PM
ఎంపీడీవో కార్యాలయం ఎదుట సిపిఐ (ఎం)ఆధ్వర్యంలో ధర్నా..
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): ఉపాధి కూలి సొమ్ములు వెంటనే చెల్లించాలని సిపిఐ ఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) మండల కార్యదర్శి గ్యానం వాసు మాట్లాడుతూ, 18 పంచాయితీలకు చెందిన 4000 కుటుంబాలు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేశారన్నారు. వారు పనులు చేసి నాలుగు వారాల నుండి పదివారాలైన ఇంతవరకు కూలి సొమ్ములు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీకి రూ.15 లక్షల నుండి రూ.20 లక్షల సొమ్ములు రూ. రెండున్నర కోట్లపైనే కూలీలకు సొమ్ములు చెల్లించాల్సి ఉందన్నారు.
ఎర్రటి ఎండలో కనీస వసతి సౌకర్యాలు లేకుండా కూలీ పనులు చేస్తే పదివారాలైన కూలి సొమ్ములు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో కూలి సొమ్ములు రాక కూలీల కుటుంబాలు పోషణ సైతం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కూలిసములు చెల్లించకపోతే పోరాటాలు ఉదృతం చేస్తామన్నారు. పది రోజుల్లో ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన కూలి సొమ్ములు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని సూపర్డెంట్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కట్ల నరసింహ చారి, కంతి వెంకయ్య, ఉపాధి కూలీలు పండా శీను, నిర్మల, రజిత, సుస్మిత,కౌసల్య, ఇర్ప సమ్మక్క, కుర్సం పూర్ణ, ఇరుప వీరమ్మ, కురుసం మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.