04-05-2025 07:38:01 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలంలో ప్రజల దాహార్తి, ఆకలి తీరుస్తున్న గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్నను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పలువురు ఉన్నారు.