26-09-2025 07:47:59 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని "శుభ్రమైన గాలి - ఆరోగ్యవంతమైన ప్రజలు" అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి దీపక్ తివారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో కార్యక్రమం సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక నినాదంతో పర్యావరణ రక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పర్యావరణ కాలుష్యం మానవ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోందని, నియంత్రణ దిశగా చెట్లు నాటడం, తక్కువ దూరాలకు వాహనాల వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యల ద్వారా గాలి నాణ్యతను పెంపొందించవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని, విద్యార్థులు చిన్నతనం నుండే సమతుల్య వాతావరణాన్ని సృష్టించడంలో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు.