26-09-2025 08:57:13 PM
తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో పశు వైద్య శాఖ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న డైరెక్టర్స్ సెక్రటరీ సురేష్ జిల్లా పశు వైద్య కార్యాలయం సహాయ సంచాలకులు డాక్టర్. వెంకన్న తుంగతుర్తి సహాయ సంచాలకులు డాక్టర్ రవి ప్రసాద్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ నరేష్ పశు వైద్య సిబ్బంది రాజశేఖర్, రవి , గోపాలమిత్రలు శ్రీనివాసరెడ్డి, శ్రీను, లింగయ్య లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ... పాల ఉత్పత్తి పెంచడానికి, పశువులు ఎద ఎదకి రావడానికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది కావున రైతులు వినియోగించుకోగలరు అని చెప్పారు.
ఇట్టి కార్యక్రమంలో ఎదకు రాని పశువులని చూలికట్టని పశువులని గర్భాశయ వ్యాధులు ఉన్న పశువులకి చికిత్స చేయడం జరిగినదని, పాల ఉత్పత్తి పెంచడానికి క్యాల్షియం టానిక్ లో, మినరల్ మిక్చర్ లో ఇవ్వడం జరిగినది. ఈరోజు మొత్తం 56 తెల్ల పశువులు ముద్ద చర్మవ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగినది 32 ఎదకురాని పశువులని చికిత్స చేసే తగు మందులు ఇవ్వడం జరిగినది56 పశువులకి పాల ఉత్పత్తి పెంచడానికి మినరల్ మిక్సర్ మరియు క్యాల్షియం టానిక్ ఇవ్వడం జరిగినది32 దూడలకి నట్టల నివారణ మందు త్రాగించడం జరిగినది. అలాగే కేవలం ఆడ దూడలు మాత్రమే పుట్టించడానికి కావలసిన వీర్యం అందుబాటులో ఉంది. కావున రైతులు వినియోగించుకోగలరు.