01-02-2026 12:34:36 AM
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ఈ నెల ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎండలు షురూ కానున్నాయి. ఇప్పటికే ఉదయం ఎండ, రాత్రి చలితీవ్రత ఉంటోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వాతావరణ శాఖ అధి కారులు తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కుమ్రం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 13.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ మేరకు వాతావరణ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.